మా జర్నీ ఎలా మొదలైందంటే!
on Feb 25, 2024
కార్తీకదీపం ఫేమ్.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ బ్యూటీ.. మధురానగరిలో హీరోయిన్ కీర్తి భట్ అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చక్కగా ఆడి ఫైనల్ వరకు వెళ్ళింది. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది కీర్తి.
‘మనసిచ్చి చూడు’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న కీర్తి.. ప్రస్తుతం ‘మధురానగరిలో ’సీరియల్ లీడ్ రోల్ చేస్తుంది. అయితే మొన్నటి వరకూ తాను అనాధనని కన్నీటి పర్యంతం అయిన కీర్తికి అండగా నిలిచాడు రియల్ హీరో కార్తీక్. కొన్నేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్‌లో కీర్తి భట్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. అమ్మ, నాన్న, అన్న, వదిన.. అన్న పిల్లలు మొత్తం చనిపోగా.. కీర్తి ఒక్కతే తీవ్ర గాయాలతో బతికింది. చానాళ్లు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది. అయితే ఆ ప్రమాదంలో ఆమె కడుపుకి బలమైన గాయం తగలడంతో.. ఆపరేషన్ చేసి.. ఆమె గర్భసంచి తీసేశారు. దీంతో ఆమెకు ఇక జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయితే ఆ విషయం తెలిసిన కూడా కార్తీక్.. కీర్తిని భార్యగా పొందటానికి అంగీకరించాడు. కీర్తిని మనస్పూర్తిగా ప్రేమించి.. తన పేరెంట్స్‌ని ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధమయ్యాడు.
కార్తిక్ తో కలిసి కీర్తిభట్ రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం ' మా జర్నీ ఎలా మొదలైంది అంటే ' అనే వ్లాగ్ తమ యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. కీర్తి మీకు ఎలా పరిచయమని యాంకర్ అడుగగా.. కార్తిక్ కి కీర్తి ఫేస్ బుక్ ఫ్రెండ్ అని.. తను రెగ్యులర్ గా ఫోటోలు అప్లోడ్ చేస్తుండేదని.. ఇక తమ సినిమాకి హీరోయిన్ గా చేస్తుందేమోనని చాలా కాజువల్ గా మెసెజ్ చేసినట్టు కార్తిక్ చెప్పాడు. అయితే తను మెసేజ్ చేసిన రెండు నెలలకి కీర్తి రిప్లై ఇచ్చిందని కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ మూవీకి లేట్ అయిందని వేరేవాళ్ళని తీసుకున్నాం మళ్ళీ సెకెండ్ మూవీకి మెసేజ్ చేశాను. తను అప్పుడు సీరియల్ లో చేస్తుండటంతో కాస్త తొందరగానే రిప్లై ఇచ్చిందని కార్తిక్ అన్నాడు. ఇక గత సంవత్సరం ఫిబ్రవరి 14th న షాన్ తో కలిసి ఫోటోలో ఉన్నాడు. అతనెలా తెలుసని కీర్తి కాల్ చేసిందంట. దాదాపు నలభై అయిదు నిమిషాలు మాట్లాడిందని కీర్తి చెప్పింది. మంగళూరు లోకల్ భాష తుళు కీర్తి పుట్టినప్పటి నుండి నేర్చుకుంటే.. కార్తిక్ మాత్రం మూడు నాలుగు నెలల్లో నేర్చుకున్నాడంట. ఇలా తమ పరిచయం ఎలా జరిగిందో కీర్తిభట్ చెప్పుకొచ్చింది. కాగా ఈ వ్లాగ్ ప్రస్తుతం యూట్యూబ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
